Sat Mar 07 2026 21:55:19 GMT+0530 (India Standard Time)
వైఎస్ అవినాష్ రెడ్డికి ఊరట
సోమవారం వరకూ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు సీబీఐని ఆదేశించింది.

సోమవారం వరకూ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు సీబీఐని ఆదేశించింది. తనను అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశాలివ్వాలంటూ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై వాదనలు జరిగాయి. అవినాష్ రెడ్డి విచారణకు సంబంధించి వీడియో, ఆడియో రికార్డులను కూడా హైకోర్టుకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.
సోమవారం వరకూ...
అలాగే హత్య జరిగిన ప్రాంతంలో దొరికిన లెటర్ తో పాటు మొత్తం వివరాలను కోర్టుకు సమర్పించాలని హైకోర్టు సీబీఐని ఆదేశించింది. సోమవారం వరకూ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని, ఆయన ఆరోజు హైకోర్టు విచారణకు హాజరు కావాల్సి ఉందని పేర్కొంది. అయితే సాక్షిగానే ఈ కేసులో అవినాష్ రెడ్డిని విచారిస్తున్నామని పేర్కొంది. మంగళవారం మరోసారి అవినాష్ రెడ్డిని విచారణకు పిలుస్తామని హైకోర్టుకు సీబీఐ తరుపున న్యాయవాది తెలిపారు.
Next Story

