Mon Mar 23 2026 00:05:37 GMT+0530 (India Standard Time)
జగన్ కు హైకోర్టు నోటీసులు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై ఈ నోటీసులు జారీ చేసింది

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై ఈ నోటీసులు జారీ చేసింది. జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈపిటీషన్ పై తెలంగాణ హైకోర్టులో నేడు విచారణ జరిగింది.
బెయిల్ ను రద్దు చేసి...
జగన్ బెయిల్ పిటీషన్ ను రద్దు చేయాలని గతంలో రఘురామ కృష్ణరాజు సీబీఐ కోర్టును ఆశ్రయించారు. అక్కడ ఆయన పిటీషన్ ను కొట్టేశారు. జగన్ పై 11 సీబీఐ ఛార్జిషీట్లు ఉన్నాయని, సాక్షులను ప్రభావితం చేస్తారని పిటీషన్ లో పేర్కొన్నారు. బెయిల్ ను రద్దు చేసి 11 ఛార్జిషీట్లపై విచారణ చేయాలని కోరారు. దీంతో తెలంగాణ హైకోర్టు జగన్ కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలు వాయిదా వేసింది.
Next Story

