Wed Mar 18 2026 11:01:12 GMT+0530 (India Standard Time)
Ys Jagan : జగన్ కేసుల్లో కీలక అప్డేట్ ఏంటంటే?
వైెఎస్ జగన్ కేసుల విచారణ రోజు వారీ చేపట్టాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది

వైెఎస్ జగన్ కేసుల విచారణ రోజు వారీ చేపట్టాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇకపై రోజు వారీ విచారణ జరగనుంది. దీంతో జగన్ కేసులు సత్వరం విచారణ జరిపి పూర్తయ్యేలా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దాఖలైన పిటీషన్ పై నేడు విచారణ జరిగింది.
ప్రతి రోజూ విచారించాలని...
సీబీఐ కోర్టులో ఉన్న జగన్ కేసులను ప్రతిరోజూ విచారించాలని నిర్ణయించారు. జగన్ కేసులపై గతంలో మాజీ మంత్రి హరిరామ జోగయ్య వేసిన పిటీషన్ పై వాదనలు జరిగాయి. దీనిపై ప్రభుత్వం తరుపున న్యాయవాది కోర్టులో విచారణ కొనసాగుతుందని తెలిపారు. ఈ కేసులో తదుపరి విచారణను హైకోర్టు మూడు వారాల పాటు వాయిదా వేసింది.
Next Story

