Fri Jan 17 2025 20:22:27 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : నేడు విశాఖకు రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు విశాఖపట్నంకు రానున్నారు. అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు విశాఖపట్నంకు రానున్నారు. అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి ఏపీలో రేవంత్ రెడ్డి పర్యటిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. అక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ప్లాంట్ ప్రయివేటీకరణకు నిరసనగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మద్దతిచ్చింది.
కార్మికులకు అండగా...
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించకుండా, అవసరమైన బొగ్గు గనులు అందించి ప్లాంట్ ను ఆదుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా ఏడాదికి పైగా వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు తమకు అండగా నిలవాలని కోరుతూ ఈ సభను ఏర్పాటు చేశాయి. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఆయన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై విమర్శలు చేసే అవకాశముంది.
Next Story