Wed Mar 18 2026 12:42:27 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : తిరుమలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి ఆయన స్వామివారిని వీఐపీ బ్రేక్ దర్శనంలో దర్శించుకున్నారు. నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్న రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు స్థానిక రచన అతిధి గృహంలో బస చేశారు. ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు.
వీఐపీ బ్రేక్ దర్శనంలో...
ఉదయం 8.30 గంటలకు స్వామి వారిని దర్శించుకున్నారు. తన మనవడికి తలనీలాలను ఇచ్చిన తర్వాత ఆయన స్వామి వారిని దర్శించుకున్నారు. రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా దర్శన ఏర్పాట్లను టీటీడీ అధికారులు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా తిరుమలకు వచ్చిన రేవంత్ రెడ్డికి ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు తెలియజేశారు. ఈరోజు తిరుమల నుంచి హైదరాబాద్ కు బయలుదేరి వెళతారు.
Next Story

