Tue Mar 17 2026 05:38:21 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : ఏపీ కొత్త ముఖ్యమంత్రిని నేను కలుస్తా
తిరుమలలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తిరుమలలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో నూతన ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ముఖ్యమంత్రిని కలుస్తానని ఆయన తెలిపారు. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీ చేస్తున్న అభివృద్ధి పనుల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని భాగస్వామ్యం చేయాలని విజ్ఞప్తి చేస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు.
ప్రభుత్వ ఏర్పాటయిన తర్వాత..
కొత్తగా ఏపీలో ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత ముఖ్యమంత్రిని కలిసి రెండు రాష్ట్రాల మధ్య సమస్యలపై చర్చిస్తానని తెలిపారు. తిరుమలలో రెండు నిర్మాణాలను కూడా చేపట్టాలని ఉందన్నారు. దీనిపై కూడా ముఖ్యమంత్రితో చర్చిస్తానని తెలిపారు. తిరుమలకు వచ్చే తెలంగాణ భక్తులకు మాత్రమే కాకుండా దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తుల కోసం నిర్మాణాలను చేపడతామని తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.
Next Story

