Mon Mar 16 2026 21:24:07 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : నేడు ఆంధ్రప్రదేశ్ కు రేవంత్ రెడ్డి
నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వెళుతున్నారు.

నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వెళుతున్నారు. విజయవాడలో జరగనున్న వైఎస్సార్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మరికొందరు మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
ఈ వేడుకలకు...
వైఎస్సార్ జయంతి వేడుకలకు హాజరు కావాలని పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆహ్వానం మేరకు జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. వైఎస్సార్ కు ఘనంగా నివాళులర్పించేందుకు కర్ణాటక, తెలంగాణ నుంచి కూడా నేతలు రానున్నారు. వైఎస్సార్ 75వ జయంతి వేడుకలను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
Next Story

