Sat Mar 07 2026 16:36:10 GMT+0530 (India Standard Time)
టెక్కలి పోలీస్ స్టేషన్ కు దువ్వాడ శ్రీనివాస్
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను దూషించిన కేసులో టెక్కలి పోలీసుల విచారణను ప్రారంభించారు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను దూషించిన కేసులో టెక్కలి పోలీసుల విచారణను ప్రారంభించారు. ఉదయం 10 గంటలకు విచారణకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ హాజరయ్యారు. దువ్వాడ శ్రీనివాస్ కు ఇప్పటికే టెక్కలి పోలీసులు 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. దీంతో దువ్వాడ శ్రీనివాస్ ను విచారించేందుకు టెక్కలి పోలీసులు సిద్ధమయ్యారు.
పవన్ కల్యాణ్ ను దూషించిన కేసులో...
పవన్ కల్యాణ్ ను అనుచిత వ్యాఖ్యలతో దూషించడమే కాకుండా, సవాళ్ల మీద సవాళ్లు విసరడంతో ఆయనపై టెక్కలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందింది. అదే సమయంలో కొందరు చేసిన ఫిర్యాదుతో దువ్వాడ శ్రీనివాస్ ను విచారించేందుకు టెక్కలి పోలీసులు సిద్ధమయ్యారు. టెక్కలి పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. వైసీపీ కార్యకర్తలు స్టేషన్ కు వస్తారని తెలిసి బందోబస్తును ఏర్పాటు చేస్తారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story

