Sun Mar 08 2026 06:23:46 GMT+0530 (India Standard Time)
నేడు టీడీపీ నారీ సంకల్ప దీక్ష
టీడీపీ మహిళ విభాగం నేడు నారీ సంకల్ప దీక్షను చేయనుంది. మంగళగిరి లోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ దీక్షను చేపట్టనున్నారు.

తెలుగుదేశం పార్టీ మహిళ విభాగం నేడు నారీ సంకల్ప దీక్షను చేయనుంది. మంగళగిరి లోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ దీక్షను చేపట్టనున్నారు. తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత నేతృత్వంలో జరిగే ఈ దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళలు హాజరుకానున్నారు.
మహిళలకు రక్షణ ఏదీ?
వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, కనీసం దిశ చట్టాన్ని కూడా అమలు చేయలేకపోతున్నారని టీడీపీ ఆరోపిస్తుంది. వరసగా జరుగుతన్న మహిళలపై అత్యాచారాలు. పోలీసుల వైఫల్యాలను నిరసిస్తూ ఈ దీక్షను చేపడుతున్నట్లు వంగలపూడి అనిత తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ పార్టీ కార్యాలయంలో ఈ దీక్ష జరగనుంది.
Next Story

