Fri Mar 27 2026 18:02:35 GMT+0530 (India Standard Time)
5న విశాఖలో ఉత్తరాంధ్ర ప్రాంతీయ సదస్సు
తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ప్రాంతీయ సదస్సు ఈనెల 5న విశాఖపట్నంలో జరగనుంది. ఈ సదస్సులో చంద్రబాబు పాల్గొననున్నారు.

తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ప్రాంతీయ సదస్సు ఈనెల 5న విశాఖపట్నంలో జరగనుంది.పీఎంపాలెం సమీపంలోని విశాఖ కన్వెన్షన్ సెంటర్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న ఈ సదస్సులో పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యఅతిధిగా పాల్గొంటారు.
చంద్రబాబు ముఖ్య అతిధిగా
జోన్లగా విభజించి ప్రాంతీయ సదస్సులను ఏర్పాటు చేసిన చంద్రబాబు నేతల్లోనూ, ముఖ్య కార్యకర్తల్లోనూ జోష్ నింపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని జోన్ల సమావేశాలు నిర్వహించి వారికి రానున్న ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలన్న దానిపై దిశానిర్దేశం చేశారు. ఉత్తరాంధ్రలో ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం గెలుపొందడంతో ఊపు మీదున్న తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు మరింత ఉత్సాహ పర్చేలా నేతలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
- Tags
- tdp
Next Story

