Tue Dec 16 2025 03:05:54 GMT+0000 (Coordinated Universal Time)
పుంగనూరులో ఉద్రిక్తత.. పెద్దిరెడ్డి ఇక్కడ పర్యటించవద్దంటూ
పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించడానికి వీలులేదని టీడీపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు

చిత్తూరు జిల్లా పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించడానికి వీలులేదని టీడీపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన వస్తారని తెలిసిన టీడీపీ కార్యకర్తలు ఆయనను అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. దీంతో పుంగనూరులో ఉద్రిక్తతలు తలెత్తాయి.
పోలీసుల జోక్యంతో...
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నియోజకవర్గంలో ఎక్కడ పర్యటించినా అడ్డుకుంటామని టీడీపీ నేతలు హెచ్చరించారు. ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని టీడీపీ నేతలను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈరోజు పుంగనూరులో పర్యటిస్తారని తెలిసి ఆందోళనకు దిగిన టీడీపీ కార్యకర్తలను పోలీసులు అక్కడి నుంచి పంపించి వేశారు.
Next Story

