Sun Mar 08 2026 03:14:14 GMT+0530 (India Standard Time)
TDP : విశాఖ డ్రగ్స్ వెనక ఎవరున్నారో తెలుసా?
జగన్ పాలనలో ఏపీ నాశనం అవుతోందని టీడీపీ మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు

జగన్ పాలనలో ఏపీ నాశనం అవుతోందని టీడీపీ మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. విశాఖలో భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయని, వైసీపీ రాష్ట్రాన్ని డ్రగ్స్ మాఫియాకు అడ్డగా మార్చిందని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో ఏం జరిగినా టీడీపీపైనే నింద వేయడం వైసీపీకి అలవాటుగా మారిందని వంగలపూడి వనిత అన్నారు.
గంజాయి పట్టుబడుతున్నా...
విశాఖలో డ్రగ్స్ ర్యాకెట్ వెనక ఎవరున్నారో తేల్చాలని ఆమె డిమాండ్ చేశారు. వైసీపీకి సన్నిహితులైన వారే ఈ డ్రగ్స్ ను తెప్పించారని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో భారీగా డ్రగ్స్, గంజాయి పట్టుబడుతున్నా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడకపోవడం దారుణమని తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు.
Next Story

