Thu Dec 11 2025 07:35:26 GMT+0000 (Coordinated Universal Time)
కల్యాణదుర్గం టీడీపీ కైవసం
అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మున్సిపల్ ఛైర్మన్ పదవి టీడీపీ గెలుచుకుంది

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మున్సిపల్ ఛైర్మన్ పదవి టీడీపీ గెలుచుకుంది. మున్సిపల్ ఛైర్మన్గా తలారి గౌతమి ఎన్నికయ్యారు. టిడిపి కి భారీగా కౌన్సిలర్లకు మద్దతు లభించడంతో టీడీపీ ఈ స్థానాన్ని గెలుచుకుంది. వైసీపీకి చెందిన కౌన్సిలర్లు ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. ఇద్దరు వైసీపీకి చెందిన కౌన్సిలర్లు గైర్హాజరు అయ్యారు.
మున్సిపల్ ఛైర్మన్ గా...
దీంతో కల్యాణదుర్గం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో భారీగా పోలీసుల బందోబస్తు ను ఏర్పాటు చేశారు. వైసీపీ, టీడీపీల మధ్య ఘర్షణ జరుగుతుందని భావించి 144 వ సెక్షన్ విధించారు. మొత్తం కల్యాణదుర్గం మున్సిపాలిటీలో 24 మంది కౌన్సిలర్లున్నారు. వీరిలో ఎక్కువ మంది టీడీపీ అభ్యర్థికి మద్దతివ్వడంతో చివరకు తలారి గౌతమి ఎన్నికయ్యారు.
Next Story

