TDP : నాలుగు దశాబ్దాలుగా పసుపు జెండా ఎగురుతున్నది ఇక్కడే
తెలుగుదేశం పార్టీ ఏర్పాటయి దాదాపు నలభై రెండేళ్లయింది.

తెలుగుదేశం పార్టీ ఏర్పాటయి దాదాపు నలభై రెండేళ్లయింది. అయితే ఈ రెండేళ్లలో అస్సలు ఓటమి ఎరుగని నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ లో రెండే రెండు ఉన్నాయి. ఒకటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం ఒకటి కాగా, మరొకటి నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం మరొకటి. ఈ రెండు నియోజకవర్గాల్లో ఓటమి అనేది తెలుగుదేశం పార్టీకి లేదు. ఇతర పార్టీలకు ఇక్కడి ప్రజలు గెలుపు అవకాశం ఇవ్వలేదు. అభ్యర్థులు ఎందరిని మార్చినా.. పార్టీలు అనేకం పుట్టుకొచ్చినా ఈ రెండు నియోజకవర్గాల్లో మాత్రం పసుపు జెండా నాలుగు దశాబ్దాల నుంచి ఎగురుతూనే ఉంది. ఇక్కడ పోటీ చేసే ప్రత్యర్థులు నామమాత్రమే. అనుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులనే వరసగా గెలుపించుకుంటూ ఈ రెండు నియోజకవర్గాల ప్రజలు పార్టీకి అండగా నిలిచారు. రెండు నియోజకవర్గాలు రాయలసీమలోనే ఉండటం విశేషం.

