Sun Mar 15 2026 02:58:50 GMT+0530 (India Standard Time)
బాబు త్వరలో సినిమా చూపిస్తారు
మున్సిపల్ ఎన్నికల ఫలితాలను చూసి తెలుగుదేశం పార్టీ భయపడటం లేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు

మున్సిపల్ ఎన్నికల ఫలితాలను చూసి తెలుగుదేశం పార్టీ భయపడటం లేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. తాము ఇంకా సంతోషంగా ఉన్నామని తెలిపారు. వైసీపీ నేతలు ఈ విజయాలను డీజీపీ గౌతం సవాంగ్ కు బొకేలు ఇచ్చి మరింత గౌరవించుకోవాలని అచ్చెన్నాయుడు అన్నారు. డీజీపీ లేకుంటే వైసీపీకి గెలుపు ఎక్కడదని ప్రశ్నించారు.
అదీ ఒక గెలుపేనా?
కుప్పంలో వైసీపీ గెలుపు ఒక గెలుపా? అని ఎద్దేవా చేశారు. అక్కడ దొంగ ఓట్లు వేయించుకుని గెలిచారని, టీడీపీ కార్యకర్తలు చేసిన పోరాటాన్ని అభినందిస్తున్నానని అచ్చెన్నాయుడు అన్నారు. చంద్రబాబు త్వరలోనే వైసీపీ నేతలకు సినిమా చూపిస్తారని ఆయన అన్నారు. వైసీపీ నేతలు సంబరాలు జరుపుకోవడం సిగ్గు చేటని అన్నారు.
- Tags
- achennaidu
- tdp
Next Story

