Mon Apr 29 2024 09:54:49 GMT+0000 (Coordinated Universal Time)
అచ్చెన్న సంచలన కామెంట్స్.. ఏపీలో ఎప్పుడైనా ఎన్నికలు
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ అసెంబ్లీకి ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చని అన్నారు
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ అసెంబ్లీకి ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చని అన్నారు. జగన్ నిద్రలో లేచి అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించే అవకాశముందని ఆయన తెలిపారు. అందుకే తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.
ప్రజల వద్దకు ....
జగన్ ప్రజల సమస్యలను పరిష్కరించలేకపోయాడని, మూడేళ్లలో అభివృద్ధి చేసిందేమీ లేదని అందుకే నేరుగా ప్రజల వద్దకు వెళ్లేందుకు సిద్ధంగాజగన్ లేడన్నారు. తిరిగి ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో ఉన్నారని అచ్చెన్నాయుడు అన్నారు. జగన్ ముందస్తు ఎన్నికలు వెళతారని అచ్చెన్నాయుడు అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీ ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉందని అచ్చెన్నాయుడు తెలిపారు.
- Tags
- achennaidu
- tdp
Next Story