Thu Dec 18 2025 23:00:18 GMT+0000 (Coordinated Universal Time)
జగన్...సారీ సదస్సులు పెట్టు.. అచ్చెన్న ఎద్దేవా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వడంపై ఆస్కార్ అవార్డుకు మించి నటించిన జగన్ రెడ్డి మోసకార్ అవార్డు ఇవ్వాలని ఆయన ఎద్దేవా చేశారు. పెయిడ్ ఆర్టిస్టులతో హోదా డ్రామాలాడించి గతంలో ప్రజలను మోసగించారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. వైసీపీ చేతకానితనం వల్లనే ప్రత్యేక హోదా రాకుండా పోతుందని ఆయన దుయ్యబట్టారు.
హోదాను బ్యాన్ చేసి.....
కేంద్ర హోంశాఖ అజెండాలో చేర్చి తొలగించడం వైసీపీ చేతకానితనానికి నిదర్శనమి అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు. జగన్ తన కేసుల మాఫీ కోసమే ఢిల్లీ వెళుతున్నారని, ప్రత్యేక హోదాను పక్కన పెట్టారని ఆరోపించారు. తాడేపల్లి నుంచి ఢిల్లీ వరకూ హోదా పేరు ను జగన్ రెడ్డి బ్యాన్ చేశారన్నారు. దీంతో యువతకు క్షమాపణలు చెప్పేందుకు జగన్ క్షమాపణ సదస్సులు నిర్వహించాలని అచ్చెన్నాయుడు సెటైర్ వేశారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేని జగన్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
Next Story

