Wed Jan 21 2026 13:01:17 GMT+0000 (Coordinated Universal Time)
ఏంటీ అక్రమ కేసులు.. తిప్పికొడతాం
సీఐడీని ఉపయోగించి జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ లు చేస్తుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు

సీఐడీని ఉపయోగించి జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ లు చేస్తుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. టీడీపీ లీగల్ సెల్ ప్రమాణ స్వీకార సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుబంధ సంఘాలన్నీ ఈరోజు పనిచేస్తున్నాయని అన్నారు. అందులో అత్యంత కీలకమైన విభాగం న్యాయవిభాగం అని ఆయన అన్నారు. ఒక దుర్మార్గుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత న్యాయవాదుల అవసరం పార్టీకి వచ్చిందన్నారు. పోలీసులతో అక్రమ కేసులు పెట్టిస్తూ భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఎవరం భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఎవరూ దోపిడీ, హత్యలు చేయలేదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు న్యాయ విభాగం పనిచేయాలన్నారు.
అధికారాన్ని ఉపయోగించి...
అధికారాన్ని ఉపయోగించి ఏ రాజకీయ పార్టీని లేకుండా చేయాలని జగన్ ప్రయత్నిస్తున్నారన్నారని అచ్చెన్నాయుడు అన్నారు. టీడీపీని ఎవరూ లేకుండా చేయలేరన్నారు. ఈ ప్రభుత్వం తెల్లారితే ఎవరిని అరెస్ట్ చేస్తారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని ఆయన అన్నారు. పోలీసు వ్యవస్థను ఈ ముఖ్యమంత్రి దుర్వినియోగం చేస్తున్నారన్నారు. సీఐడీ విభాగాన్ని తన జేబు సంస్థగా పెట్టుకున్నారన్నారు. సీఐడీని ఉపయోగించి అడ్డగోలుగా కేసులు పెడుతున్నారన్నారు. ఈ సారి ఊరికినేది లేదని, టీడీపీ అధికారంలోకి రాగానే వడ్డీతో సహా చెల్లిస్తామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
- Tags
- achchennaidu
- cid
Next Story

