Wed Jan 21 2026 13:01:12 GMT+0000 (Coordinated Universal Time)
ప్రశ్నిస్తే .. అడ్డుకుంటారా?
టీడీపీ పోరుబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకోవడాన్నిరాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు.

తెలుగుదేశం పార్టీ పోరుబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకోవడాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ పోరుబాటను అడ్డుకోవడం అప్రజాస్వామికమని ఆయన అన్నారు. జగన్ అండ్ కో ఉత్తరాంధ్రను దోచుకుంటుందని, వైసీపీ నేతల వ్యవహారాలు బయటపడతాయనే నేతలను పోలీసులు నిర్భంధించారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.
ఈ నిర్భంధాలేంటి?
టీడీపీ నేత బుద్దా వెంకన్న, గౌతు శిరీషల అక్రమ నిర్భంధాలను ఆయన ఖండించారు. నేతలను నిర్భంధాన్ని చేయడం చూస్తుంటే వైసీపీ నేతల అరాచక పాలన ఏందో అర్థమవుతుందని ఆయన తెలిపారు. రుషికొండను అక్రమంగా తవ్వుతున్నారని, అక్కడకు వెళ్లేందుకు కూడా అనుమతించడం లేదని అచ్చెన్నాయుడు అన్నారు. ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు.
Next Story

