Sun Mar 08 2026 04:07:21 GMT+0530 (India Standard Time)
నేడు సీఐడీ ఎదుటకు చింతకాయల విజయ్
ఈరోజు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ సీఐడీ ఎదుట విచారణకు హాజరుకానున్నారు

ఈరోజు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ సీఐడీ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. ఉదయం 10.30 గంటలకు గుంటూరు సీఐడీ కార్యాలయంలో విచారణ జరగనుంది. భారతీ పే యాప్ అంటూ సోషల్ మీడియాలో చేసిన ప్రచారంపై చింతకాయల విజయ్ పై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. తొలుత ఈ నెల 27 న విచారణ కు హాజరు కావాలని సీఐడీ నోటీసులు ఇచ్చింది. తనకు వేరే కార్యక్రమాలు ఉండటంతో రాలేనని చెప్పడంతో హైకోర్టు సూచన మేరకు నేడు విజయ్ హాజరు కావాల్సి ఉంది.
న్యాయవాది సమక్షంలో...
న్యాయవాది సమక్షంలో విజయ్ హాజరయ్యేందుకు కోర్టు అనుమతిచ్చింది. దీంతో సీఐడీ మళ్లీ 41 ఎ నోటీసులు అందచేసింది. గత ఏడాది భారతి పే అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టుపై చింతకాయల విజయ్ పై కేసు నమోదయింది. దీనిపై విచారించేందుకు ఒకసారి హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లగా అక్కడ గందరగోళం నెలకొంది. దీంతో సీఐడీ అధికారులు మరోసారి 41 ఎ నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని తెలిపారు. విజయ్ ఈరోజు సీఐడీ ఎదుట హాజరయ్యే అవకాశముంది.
Next Story

