Fri Feb 20 2026 19:37:43 GMT+0530 (India Standard Time)
రద్దు అందుకే చేశారు.. ఆ సంగతి జగన్ కు తెలుసు
మూడు రాజధానుల రద్దు నిర్ణయం అనాలోచితమైన నిర్ణయమని టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ అన్నారు.

మూడు రాజధానుల రద్దు నిర్ణయం అనాలోచితమైన నిర్ణయమని టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. న్యాయస్థానంలో కేసు వీగిపోతుందని భావించి జగన్ హడావిడిగా ఆ నిర్ణయం తీసుకున్నారని పయ్యావుల అభిప్రాయపడ్డారు. కోర్టులో వాదనలు ముగిసే సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. అంటే తాను గతంలో చేసిన చట్టాలు తప్పేనని ముఖ్యమంత్రి జగన్ అంగీకరించినట్లేనా? అని పయ్యావుల ప్రశ్నించారు.
తీర్పు వచ్చే సమయంలో....
తీర్పు వచ్చే సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నారని, అన్ని లెక్కలు వేసుకునే చట్టాలను రద్దు చేశారని పయ్యావుల కేశవ్ తెలిపారు. ఇప్పటి వరకూ జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. ఇప్పుడు రాజధాని అమరావతి అని జగన్ అంగీకరిస్తారా? అని ఆయన ప్రశ్నించారు.
Next Story

