Thu Mar 19 2026 08:12:33 GMT+0530 (India Standard Time)
Breaking : కన్నా లక్ష్మీనారాయణపై రాళ్ల దాడి.. పరిస్థితి ఉద్రిక్తం
టీడీపీ సత్తెనపల్లి ఇన్ఛార్జి కన్నా లక్ష్మీనారాయణపై రాళ్ల దాడి జరిగింది.

టీడీపీ సత్తెనపల్లి ఇన్ఛార్జి కన్నా లక్ష్మీనారాయణపై రాళ్ల దాడి జరిగింది. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో 'బాబు ష్యూరిటీ, భవష్యత్తుకు గ్యారంటీ' కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ తొండపి గ్రామానికి వచ్చారు.
లైట్లు ఆర్పి మరీ...
అయితే కన్నా లక్ష్మీనారాయణపై ఒక్కసారిగా గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడి చేశారు. పథకం ప్రకారం లైట్లు ఆర్పివేసి భవనాలపై నుంచి రాళ్లు వేశారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ దాడిలో కన్నా లక్ష్మీనారాయణ పీఏ స్వామి, టీడీపీ నాయకులకు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే రాళ్ల దాడికి పాల్పడింది ఎవరన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

