Thu Mar 19 2026 08:36:55 GMT+0530 (India Standard Time)
21న విశాఖలో టీడీపీ ప్రాంతీయ సదస్సు
తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ సదస్సు ఈ నెల 21న విశాఖలో జరగనుంది. ఈ సదస్సుకు చంద్రబాబు హాజరుకానున్నారు

తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ సదస్సు ఈ నెల 21న విశాఖలో జరగనుంది. పీఎంపాలెంలో ఉన్న వైజాగ్ కన్వెన్షన్ లో ప్రాంతీయ సదస్సు జరుగుతుంది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు చెందిన నాయకులు ఈ సదస్సులో పాల్గొంటారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ ఈ సదస్సు జరగనుంది.
చంద్రబాబు దిశానిర్దేశం...
ఈ సదస్సుకు ముఖ్యఅతిధిగా టీడీపీ అధినేత చంద్రబాబు హాజరు కానున్నారు. ఆయన పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ సమావేవానికి పొలిట్ బ్యూరో సభ్యులు, జోనల్ ఇన్ఛార్జులు, పార్లమెంటు కో ఆర్డినేటర్లు, గత ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, నియోజకవర్గ పరిశీలకులు హాజరు కావాలని ఇప్పటికే ఆదేశించారు. ప్రాంతాల వారీగా చంద్రబాబు సదస్సులను ఏర్పాటు చేసి నేతల్లో ఉత్సాహం నింపేందుకు చేసే ప్రయత్నంలో భాగంగా విశాఖలో ఈ సదస్సును ఏర్పాటు చేశారు.
Next Story

