Fri Oct 04 2024 05:22:35 GMT+0000 (Coordinated Universal Time)
పార్లమెంటులో చంద్రబాబు అరెస్ట్ అంశం
పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని టీడీపీ లేవనెత్తింది.
పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని టీడీపీ లేవనెత్తింది. తొలి రోజు పార్లమెంటు సమావేశాల్లో టీడీపీ సభ్యుడు గల్లా జయదేవ్ ఈ అంశాన్ని లేవనెత్తారు. దీనిపై ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబును అక్రమంగా స్కిల్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ కేసులో అరెస్ట్ చేశారంటూ ఆయన ఆరోపించారు. ఇది రాజకీయ కక్షగానే చూడాల్సి ఉందని గల్లా జయదేవ్ పేర్కొన్నారు.
వైసీపీ ఖండన...
అయితే దీనిని వైసీపీ పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డి ఖండించారు. గల్లా జయదేవ్ వ్యాఖయలకు కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు స్కిల్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. 80 షెల్ కంపెనీలకు డబ్బులు వెళ్లాయని ఐటీ శాఖ తేల్చిందన్నారు. ఇన్నాళ్లు స్టేలతో చంద్రబాబు తప్పించుకున్నారన్న మిధున్ రెడ్డి ఐటీ శాఖ చంద్రబాబుతో పాటు ఆయన పీఏకు కూడా నోటీసులు ఇచ్చిందన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ జోక్యం లేదని మిధున్ రెడ్డి తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా దీనిని ధృవీకరించాయని తెలిపారు. జీఎస్టీ కూడా చెల్లించలేదని చెప్పిందన్నారు.
Next Story