Fri Dec 05 2025 19:42:09 GMT+0000 (Coordinated Universal Time)
చెవిలో పువ్వులతో బుద్దా వెంకన్న?
టీడీపీ విన్నూత్నంగా నిరసన తెలిపింది. విద్యుత్తు ఛార్జీల పెంపును నిరసిస్తూ చెవిలో పువ్వులు పెట్టుకుని ఆందోళనకు దిగింది.

విజయవాడలో తెలుగుదేశం పార్టీ విన్నూత్న తరహలో నిరసన తెలిపింది. విద్యుత్తు ఛార్జీల పెంపును నిరసిస్తూ చెవిలో పువ్వులు పెట్టుకుని ఆందోళనకు దిగింది. టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలు కలసి చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసనలు తెలియజేశారు. అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజల చెవిలో ప్రతిరోజూ పూలు పెడుతున్నారన్నారు. మద్యనిషేధం అన్న జగన్ చీప్ లిక్కర్ ను అందుబాటులోకి తెచ్చి ప్రజలను వంచించారన్నారు.
భయంతోనే పాలన...
151 సీట్లు వచ్చినా జగన్ భయంతోనే పాలన సాగిస్తున్నారని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. అందుకే తాము చెవిలో పువ్వు పెట్టుకుని నిరసన తెలుపుతున్నామన్నారు. ప్రజలపై విద్యుత్ భారం మోపి సిగ్గులేకుండా దానిని సమర్థించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఏసీలను బంద్ చేసి ఆ తర్వాత ప్రజలకు పిలుపు నివ్వాలని బుద్దా వెంకన్న కోరారు. పెంచిన విద్యుత్తు ఛార్జీలను ఉపసంహరించుకునేంతవరకూ టీడీపీ పోరాటం చేస్తుందని తెలిపారు.
Next Story

