Wed Mar 18 2026 21:46:47 GMT+0530 (India Standard Time)
జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది
రాజకీయ యోధుడైన చంద్రబాబును వైసీపీ ఏమీ చేయలేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు

రాజకీయ యోధుడైన చంద్రబాబును వైసీపీ ఏమీ చేయలేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. వైసీపీ మైండ్ గేమ్ ప్రారంభించిందన్నారు. సమస్యలను పరిష్కరించడం చేతకాక టీడీపీ నేతలను అవమానపరుస్తూ ప్రజల దృష్టిని మరలిస్తుందని బొండా ఉమ అన్నారు.
అభివృద్ధిని పక్కన పెట్టి...
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిని పక్కన పెట్టి అరాచకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడమే కాకుండా, వారిపై దాడులు చేయిస్తూ పైశాచికానందాన్ని పొందుతున్నారని అన్నారు. జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువయిందని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని బొండా ఉమ అన్నారు.
Next Story

