Thu Jan 22 2026 03:19:24 GMT+0000 (Coordinated Universal Time)
TDP : నేడు టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం
టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం నేడు జరగనుంది. చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.

తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా నామినేటెడ్ పోస్టులపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశముంది. కూటమిలోని మిత్ర పక్షాలకు ఎన్ని నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి? ఏ ఏ ప్రాంతంలో ఎవరెవరెవరికి? నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలన్న దానిపై సీనియర్ నేతల నుంచి చంద్రబాబు అభిప్రాయాన్ని తెలుసుకోనున్నారు.
పార్టీని సంస్థాగతంగా...
దీంతో పాటు పార్టీని సంస్థాగతంగా బలోపేతంపై చర్చ ను టీడీపీ పొలిట్బ్యూరోలో చర్చిస్తారని ెలిసింది. మిషన్ 2029 లక్ష్యంగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్న టీడీపీ అందుకు అవసరమైన నిర్ణయాలు ఈ సమావేశంలో తీసుకునే ఛాన్స్ ఉంది. దీంతో పాటు విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికపైనా చర్చ జరుగుతుంది. అక్కడ అభ్యర్థిని ఎవరిని పోటీ చేయించాలన్నది నేడు నిర్ణయించే అవకాశముంది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి రాష్ట్రానికి అవసరమైన నిధులు తెచ్చే విషయంపైనా చర్చించనున్నారు.
Next Story

