Mon Mar 23 2026 19:28:35 GMT+0530 (India Standard Time)
పార్లమెంటుకు ఏపీ అసెంబ్లీ ఘటన..?
టీడీపీ పార్లమెంటరీ సమావేశం నేడు జరగనుంది. చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో వ్యూహాలను చర్చించనున్నారు

తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశం నేడు జరగనుంది. చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించనున్నారు. మొత్తం నలుగురు సభ్యులున్న పార్లమెంటులో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై ఏ విధంగా పార్లమెంటు ఉభయ సభల్లో లేవనెత్తాలన్న దానిపై చర్చించనున్నారు.
చంద్రబాబుకు అవమానం....?
ప్రధానంగా ఏపీలో వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతలపై పెడుతున్న అక్రమ కేసులతో పాటు, అసెంబ్లీలో ఇటీవల జరిగిన పరిణామాలు, చంద్రబాబు కుటుంబంపై మాటల దాడిని ఉభయ సభల్లో ప్రస్తావించే విషయంపై చర్చించనున్నారు. దీనివల్ల జాతీయ స్థాయిలో వైసీపీ ప్రభుత్వంపై చర్చ జరుగుతుందని భావిస్తున్నారు. దీంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ, ప్రత్యేక హోదా, పోలవరం నిధుల విడుదల వంటి అంశాలపై కూడా పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తనున్నారు. ఈ నెల 29వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
Next Story

