Mon Mar 16 2026 15:18:31 GMT+0530 (India Standard Time)
పట్టాభిని రాజమండ్రి జైలుకు తరలింపు
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిని రాజమండ్రి జైలుకు తరలిస్తున్నారు

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిని రాజమండ్రి జైలుకు తరలిస్తున్నారు. గన్నవరం సబ్ జైలులో ఉంచితే శాంతి భద్రతల సమస్య తలెత్తుందని జైలర్ న్యాయమూర్తి దృష్టికి తీసుకురాగా ఆయనను రాజమండ్రి జైలుకు తరలించాల్సిందిగా ఆదేశించారు. ఈ మేరకు పోలీసులు ప్రత్యేక బందోబస్తు మధ్య పట్టాభిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోలీసులు తరలిస్తున్నారు.
గన్నవరం ఘర్సణల సమయంలో..
గన్నవరం ఘర్షణల సమయంలో పట్టాభి రెచ్చగొట్టడం వల్లనే సర్కిల్ ఇన్స్పెక్టర్ కు తీవ్రగాయాలయ్యాయని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. సీఐ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. పట్టాభితో పాటు మరో 11 మందిపై హత్యాయత్నం కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు.
Next Story

