Sat Mar 07 2026 17:08:10 GMT+0530 (India Standard Time)
Chandrababu : ఘనంగా కుప్పంలో చంద్రబాబు వేడుకలు
కుప్పం నియోజకవర్గంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి

కుప్పం నియోజకవర్గంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కుప్పం పి.ఈ.ఎస్ మెడికల్ కాలేజీ లోని నారా భువనేశ్వరి బస కేంద్రంలో ఘనంగా జరిగాయి. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిమిని రవి నాయుడు, భువనేశ్వరి టీమ్ ఆధ్వర్యంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు జరిగాయి.
కేక్ కట్ చేసిన...
తెలుగు యువత నాయకులు ఏర్పాటు చేసిన కేక్ ను చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కట్ చేసి టీమ్ సభ్యులకు పంచారు. చంద్రబాబు జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, డాక్టర్ సురేష్, నారా భువనేశ్వరి టీమ్, కుప్పం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు ఆయురారోగ్యాలతో మరింత కాలం రాష్ట్ర ప్రజలకు సేవలందించాలని వారు ఆకాంక్షించారు.
Next Story

