Sun Mar 15 2026 16:17:40 GMT+0530 (India Standard Time)
గిట్టుబాటు ధర ఏదీ?
టమాటా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు

టమాటా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. టమాటా కిలో మూడు రూపాయలకు పడిపోయిందని ఆయన ఆందోళన చెందారు. పత్తికొండ మార్కెట్లో ికిలో టమాటా కేవలం మూడు రూపాయలే పలకడం రైతులకు ఇబ్బందిగా మారిందన్నారు.
స్థిరీకరణ ధర...
జగన్ రెడ్డి చెప్పిన స్థిరీకరణ ధర ఏమయిందని చంద్రబాబు ప్రశ్నించారు. రైతుల వద్ద మూడు రూపాయలకు కొంటున్నా వినియోగదారులకు చేరేసరకి ముప్ఫయి రూపాయలకు విక్రయిస్తున్నారని ఆయన అన్నారు. స్థిరీకరణ నిధికి మూడు వేల కోట్ల రూపాయలను కేటాయిస్తామన్న జగన్ వాగ్దానం ఎటు పోయిందని ఆయన ప్రశ్నించారు. వెంటనే టమాటా రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Next Story

