Fri Jan 17 2025 07:40:09 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : చింతలపూడి టీడీపీ ఇన్ఛార్జి ఈయనే
చింతలపూడి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా సొంగా రోషన్ కుమార్ ను నియమిస్తూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయించారు
చింతలపూడి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా సొంగా రోషన్ కుమార్ ను నియమిస్తూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. చింతలపూడి నియోజకవర్గానికి మాజీ మంత్రి పీతల సుజాత ఆశిస్తున్నారు. ఆమెకు ఈసారి పక్కన పెట్టినట్లే అర్థమవుతుంది. గత ఎన్నికల్లోనూ పీతల సుజాతకు టిక్కెట్ ఇవ్వలేదు.
పీతల సుజాతకు...
ఈసారి అయినా తనకు వస్తుందని పీతల సుజాత ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇన్ఛార్జిగా చింతలపూడికి సొంగా రోషన్ కుమార్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ కావడంతో ఆమె వర్గీయులు తీవ్ర నిరాశకు గురయ్యారు. పీతల సుజాతపై గతంలో అవినీతి ఆరోపణలు రావడంతో పాటు, మాగంటి కుటుంబంతో కూడా సఖ్యత లేకపోవడంతో ఆమెను దూరంగా పెట్టినట్లు తెలిసింది.
Next Story