Sun Feb 01 2026 06:52:33 GMT+0000 (Coordinated Universal Time)
నేడు పీలేరు నియోజకవర్గంలో లోకేష్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు పీలేరు నియోజకవర్గంలో జరగనుంది

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు పీలేరు నియోజకవర్గంలో జరగనుంది. ఇప్పటి వరకూ నారా లోకేష్ 448.1 కిలోమీటర్ల మేర నడిచారు. జనవరి 27న కుప్పంలో ప్రారంభమైన పాదయాత్ర నేటికీ చిత్తూరు జిల్లాలోనే కొనసాగుతుంది. నేటికి పాదయాత్ర 35వ రోజుకు చేరుకుంది. ఉదయం 9 గంటలకు రాత్రి బస చేసిన జ్యోతినగర్ నుంచి ప్రారంభమై పది గంటలకు పీలేరు భాస్కర్ ఐటీఐ కళాశాల వద్దకు చేరుకుంటుంది.
బహిరంగ సభ...
పీలేరు భాస్కర ఐటీఐ సమీపంలోనే ఆయన మధ్యాహ్న భోజన విరామానికి ఆగుతారు. సాయంత్రం 3.50 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి పీలేరులో బహిరంగ సభలో ప్రసంగించనున్నారరు. అనంతరం 5.30 గంటలకు పీలేరు జంక్షన్ వద్ద స్థానికులతో సమావేశమవుతారు. 6.05 గంటలకు పీలేరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద స్థానికులతో సమావేశమై సమస్యలపై చర్చించనున్నారు. అనంతరం ముస్లిం సామాజికవర్గం ప్రజలతో సమావేశమవుతారు. ఆ తర్వాత పీలేరు శివారు విడిది కేంద్రంలో రాత్రి బస చేస్తారు
Next Story

