Tue Mar 24 2026 23:40:26 GMT+0530 (India Standard Time)
Nara Lokesh : లోకేష్ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు

Nara Lokesh :టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. ఉండవల్లి కరకట్ట వద్ద ఆయన వాహనాన్ని ఆపి సోదాలు నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ప్రతి వాహనాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. కరకట్ట నుంచి ఆయన తాడేపల్లికి తన వాహనంలో బయలుదేరి వెళుతుండగా పోలీసులు ఆపి ఆయన వాహనాన్ని తనిఖీలు చేశారు.
సహకరించిన పోలీసులు...
కాగా పోలీసుల తనిఖీకి లోకేష్ సహకరించారు. తాడేపల్లిలోని అపార్ట్మెంట్ వాసులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న ఆయన వాహనాన్ని ఆపి సోదాలు నిర్వహించారు. ఆయన వాహనంతో పాటు లోకేష్ కాన్వాయ్ లో ఉన్న వాహనాలను కూడా తనిఖీలు చేశారు. సోదాలు తర్వాత ఆయన తన ప్రచారానికి బయలుదేరి వెళ్లారు.
Next Story

