Wed Feb 04 2026 19:52:15 GMT+0000 (Coordinated Universal Time)
బాబును చంపే కుట్ర : లోకేష్ ట్వీట్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ సంచలనంగా మారింది

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ సంచలనంగా మారింది. జైలులోనే చంద్రబాబును చంపే కుట్ర జరుగుతుందన్నారు. సైకో జగన్ తమ పార్టీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయించి జైలులోనే అంతం చేేసే ఆలోచన చేస్తున్నారని లోకేష్ అన్నారు. చంద్రబాబుకు ఏం జరిగినా జగన్ దే బాధ్యత అని లోకేష్ అన్నారు. ఆధారాలు లేని కేసులో బెయిల్ రాకుండా జెల్ లోనే చంపేందుకు పెద్ద ప్లాన్ వేశారంటూ లోకేష్ ఆరోపించారు.
అంతం చేసేందుకు...
జైలులో దోమలు కుడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న లోకేష్ అదే జైలులో రిమాండ్ ఖైదీ డెంగ్యూ వాధితో మరణించారని గుర్తు చేశారు. చంద్రబాబును కూడా ఇలాగే చంపేయాలని జగన్ కుతంత్రాలు చేస్తున్నాడని ఆరోపించారు. చంద్రబాబుకు ఏం జరిగినా అందుకు వైసీపీ ప్రభుత్వంతో పాటు జగన్ బాధ్యత వహించాలంటూ ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
Next Story
