Sun Feb 01 2026 06:52:34 GMT+0000 (Coordinated Universal Time)
19వ రోజుకు లోకేష్ పాదయాత్ర
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు సత్యవేడు నియోజకవర్గంలో జరగనుంది.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు సత్యవేడు నియోజకవర్గంలో జరగనుంది. 19వ రోజు ప్రారంభమైన ఈ పాదయాత్ర నేటికి 231 కిలోమీటర్ల మేర సాగింది. గత నెల 27వ తేదీన ప్రారంభమైన యాత్ర చిత్తూరు జిల్లాను దాటి తిరుపతి జిల్లాలోకి ప్రవేశించింది. ఉదయం నారాయణవనం మండలం విత్తన తడుకు నుంచి ప్రారంభమైన పాదయాత్ర స్థానికులతో సమావేశమవుతూ సాగుతుంది.
స్థానికులను కలుసుకుంటూ...
ఈరోజు ఉదయం 10.30 గంటలకు అరణ్యకండ్రిగ గ్రామంలో దాసరి పద్మశాలి సామాజికవర్గంతో లోకేష్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం కృష్ణంరాజు కండ్రిక, తుంబూర ప్రాంతాల మీదుగా మధ్యాహ్నానికి ఆర్.కండ్రిక చేరుకుని భోజన విరామానికి ఆగనున్నారు. లంచ్ బ్రేక్ తర్వాత మధ్యాహ్నం బయలుదేరి సాయంత్రం స్థానికులతో సమావేశమై వారి సమస్యలపై లోకేష్ చర్చించనున్నారు.
Next Story

