Wed Dec 17 2025 12:52:22 GMT+0000 (Coordinated Universal Time)
ధర్మవరంలోకి లోకేష్ పాదయాత్ర
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు ధర్మవరంలో జరగనుంది.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు ధర్మవరంలో జరగనుంది. లోకేష్ పాదయాత్ర 58వ రోజుకు చేరుకుంది. ఆదివారం ఉదయం 8 గంటలకు పాదయాత్ర ప్రారంభం అయింది. 8.45 గంటలకు కురబ సామాజికవర్గీయులతో భేటీ కానున్నారు. ఉదయం 9.50 గంటలకు బోయ సామాజికవర్గీయులతో లోకేష్ సమావేశమై వారి సమస్యలపై చర్చించనున్నారు.
పరిటాల శ్రీరామ్...
ఉదయం 10.,30 గంటలకు వేల్పుమడుగు వద్ద పొడరాళ్లపల్లి వాసులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. మధ్యాహ్నం 12.10 గంటలకు బత్తలపల్లిలో భోజన విరామానాకి ఆగుతారు. సాయంత్రం నాలుగు గంటలకు బత్తలపల్లిలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. రాత్రి 7.30 గంటలకు ముష్టూరులో బస చేయనున్నారు. లోకేష పర్యటనలో మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరామ్ అంతా తానే అయి చూసుకుంటున్నారు.
Next Story

