Mon Feb 02 2026 03:21:00 GMT+0000 (Coordinated Universal Time)
27న కుప్పంలో పార్టీ యంత్రాంగం మొత్తం
ఈ నెల 27వ తేదీ నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం కానుంది.

ఈ నెల 27వ తేదీ నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం కానుంది. కుప్పం నియోజకవర్గం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర ప్రారంభ కార్యక్రమానికి నందమూరి, నారా కుటుంబ సభ్యులు హాజరు కావాలని నిర్ణయించారు. వీరితో పాటు పాదయాత్ర ప్రారంభోత్సవానికి 175 నియోజకవర్గ ఇన్‌ఛార్జులు కూడా పొల్గొననున్నారు.
నియోజకవర్గానికి......
ఇన్‌ఛార్జులతో పాటు అధికార ప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా హాజరు కానున్నారు. చిత్తూరు జిల్లాలో నెల రోజుల పాటు పాదయాత్ర ఉండేలా ప్లాన్ చేశారు. నియోజకవర్గంలో మూడు రోజుల పాదయాత్ర కొనసాగేలా రూట్ మ్యాప్ ను రూపొందించారు. పాదయాత్రను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. పాదయాత్ర సజావుగా కొనసాగాలే ఈ బృందాలే అన్ని చర్యలు తీసుకుంటాయి.
Next Story

