Thu Apr 02 2026 22:00:54 GMT+0530 (India Standard Time)
జగన్ కు నారా లోకేష్ లేఖ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన ఎంబీబీఎస్ విద్యార్థులకు ప్రభుత్వం భరోసా ఇవ్వాలని లోకేష్ కోరారు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ లో వారి ఎంబీబీఎస్ చదువులు మధ్యలో ఆగిపోయాయని, వాటిని పూర్తి చేసేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
తమిళనాడు, తెలంగాణలో....
దీనిపైన ఏపీ ప్రభుత్వం విధానపరమైన ప్రకటన చేయాలని నారా లోకేష్ తన లేఖలో కోరారు. తమిళనాడు, తెలంగాణ ప్రభుత్వాలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయని చెప్పారు. ఉక్రెయిన్ విద్యార్థుల చదువుల బాధ్యతలను ఏపీ ప్రభుత్వం తీసుకోవాలని నారా లోకేష్ కోరారు.
Next Story

