Sat Dec 06 2025 18:07:53 GMT+0000 (Coordinated Universal Time)
Nara Lokesh : నేడు ఢిల్లీకి లోకేష్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. న్యాయనిపుణులతో సంప్రదింపులు జరపడానికి ఆయన ఢిల్లీకి వెళుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సుప్రీంకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటీషన్ పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఆయన న్యాయనిపుణులతో సంప్రదింపులు జరపనున్నారు.
వరస కేసులు...
దీంతో పాటు చంద్రబాబుపై వరసగా కేసులు నమోదు అవుతుండటం కూడా పార్టీ క్యాడర్ ను ఆందోళనకు గురి చేస్తుంది. వరసగా నమోదవుతున్న కేసుల విషయంలో ఏమేం ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై నారా లోకేష్ న్యాయనిపుణులతో చర్చించనున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. రెండు రోజులు ఆయన ఢిల్లీలోనే ఉంటారని తెలిసింది.
Next Story

