Thu Mar 19 2026 05:49:39 GMT+0530 (India Standard Time)
రేపు శ్రీశైలానికి నారా లోకేష్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రేపు శ్రీశైలం వెళ్లనున్నారు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రేపు శ్రీశైలం వెళ్లనున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి శ్రీశైలానికి వెళ్లనున్నారు. అక్కడ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉదయం 9.30 గంటలకు సాక్షి గణపతి ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం శ్రీశైలం ఆలయానికి వెళతారు.
ప్రత్యేక పూజలు...
ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో శ్రీశైలం ఆలయాన్ని సందర్శించి లోకేష్ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. లోకేష్ కు స్వాగతం పలికేందుకు పెద్దయెత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు ఏర్పాటు చేస్తున్నారు. భ్రమరాంబికా మల్లికార్జునస్వామిని దర్శించుకున్న అనంతరం లోకేష్ తిరిగి రోడ్డు మార్గాన హైదరాబాద్కు చేరుకుంటారు.
Next Story

