Sat Mar 07 2026 11:18:38 GMT+0530 (India Standard Time)
రేపు ఢిల్లీలో లోకేష్ దీక్ష
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రేపు ఢిల్లీలో ఒకరోజు నిరాహార దీక్ష చేయనున్నారు

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రేపు ఢిల్లీలో ఒకరోజు నిరాహార దీక్ష చేయనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ గాంధీ జయంతి రోజున ఒక రోజు దీక్ష చేయాలని లోకేష్ నిర్ణయించారు. రేపు రాజమండ్రిలో నారా భువనేశ్వరి కూడా ఒక రోజు నిరసన దీక్ష చేయనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా...
ఢిల్లీలో లోకేష్ తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ నివాసంలో దీక్ష చేపట్టనున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయనున్నారు. లోకేష్ నిరాహార దీక్షలో తెలుగుదేశం పార్టీ నేతలు కూడా పాల్గొననున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రేపు నిరాహార దీక్షలు చేస్తూ తమ నిరసనలు తెలియజేయనున్నారు.
Next Story

