Mon Jan 20 2025 15:18:39 GMT+0000 (Coordinated Universal Time)
Nara Lokesh : నేడు లోకేష్ నామినేషన్.. భారీ ర్యాలీతో వెళ్లి
నేడు మంగళగిరి అభ్యర్థిగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నామినేషన్ దాఖలు చేయనున్నారు
నేడు మంగళగిరి అభ్యర్థిగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. మంగళగిరి అభ్యర్థిగా నేడు రెండు సెట్ల నామినేషన్లను లోకేష్ దాఖలు చేయనున్నారు. మంగళగిరి శ్రీ సీతారామ కోవెలలో యువనేత నామినేషన్ పత్రాలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వెలుపల సర్వమత ప్రార్థనలు నిర్వహిస్తారు.
ప్రార్థనల అనంతరం...
ప్రార్థనల అనంతరం మంగళగిరి సీతారామ కోవెల నుంచి ప్రారంభం ర్యాలీ కానుంది. మంగళగిరి మిద్దె సెంటర్, వైష్ణవి కల్యాణమండపం, పాత బస్టాండ్ సెంటర్ మీదుగా మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకోనుంది. ర్యాలీ మధ్యాహ్నం 2. 34 గంటలకు యువనేత లోకేష్ తరపున వేలాది ప్రజల సమక్షంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు.
Next Story