Sat Dec 06 2025 00:21:39 GMT+0000 (Coordinated Universal Time)
Nara Lokesh : తమిళనాడులో లోకేష్ ఎన్నికల ప్రచారం
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తమిళనాడులో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తమిళనాడులో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. ఆయన కోయంబత్తూరు బీజేపీ ఎంపీ అభ్యర్థి, తమిళనాడు బీజేపి రాష్ర్ట అధ్యక్షుడు అన్నామలై కి మద్దతుగా ప్రచారం చేయనున్నారు. తెలుగు ఓటర్లు ఎక్కువగా స్థిరపడిన ప్రాంతాల్లో లోకేష్ ప్రచారం నిర్వహించనున్నారు.
కోయంబత్తూరులో...
రేపు రాత్రి ఏడు గంటలకు పీలమేడు ప్రాంతంలో తమిళనాడు బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభలో నారా లోకేష పాల్గొననున్నారు. అలాగే శుక్రవారం ఉదయం 8 గంటలకు సింగనల్లూర్ ఇందిరా గార్డెన్స్ లో తెలుగు పారిశ్రామికవేత్తలతో సమావేశం అయి అన్నామలై విజయానికి సహకరించాలని లోకేష్ కోరనున్నారు.
Next Story

