Sat Apr 04 2026 02:50:07 GMT+0530 (India Standard Time)
జగన్ రెడ్డి మేలుకో... లేకుంటే ఖాళీ అవుతుంది
వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకఏస్ ఫైర్ అయ్యారు.

వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకఏస్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వ వైఖరి కారణంగా కంపెనీలన్నీ ఏపీీ నుంచి తరలిపోతున్నాయన్నారు. ఇక్కడ పరిస్థితిని చూసి ఇతర రాష్ట్రాలకు వెళ్లడమే మంచిదని కంపెనీలు భావిస్తున్నాయని నారా లోకేష్ అన్నారు. విశాఖను అభివృద్ధి చేస్తామని చెప్పిన జగన్ రెడ్డి దానిని దోచుకోవడానికే ప్రయత్నిస్తున్నారని నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు.
హెచ్ఎస్బిసీ మూత....
దాదాపు దశాబ్దన్నర కాలం నుంచి విశాఖ ప్రాంతంలో సేవలందిస్తూ, వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న హెచ్ఎస్బిసి మూతపడటం విచారకరమని నారా లోకేష్ ఆవేదన చెందారు. ప్రభుత్వ నిర్ణయాలు, వైసీపీ నేతల బెదిరింపులకే కంపెనీలు ఏపీ నుంచి తరలి వెళుతున్నాయని లోకేష్ మండి పడ్డారు. సబ్జెక్ట్ లేని సీఎం మూడు రాజధానులంటూ కాలక్షేపం చేస్తున్నారని, కంపెనీలు మాత్రం తమ దారిని తాము చూసుకుంటున్నాయని తెలిపారు.
Next Story

