Sat Apr 04 2026 13:42:51 GMT+0530 (India Standard Time)
మూర్ఖుడు మారాలనుకోవడం...?
మూర్ఖుడు మారాలనుకోవడం అత్యాశే అవుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు

మూర్ఖుడు మారాలనుకోవడం అత్యాశే అవుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్ పై ఆయన మండి పడ్డారు. జగన్ తుగ్లక్ అని, మారాలని కోరుకోవడం కూడా అత్యాశే అవుతుందని నారా లోకేష్ అన్నారు. అసెంబ్లీలో అన్నీ అబద్ధాలు చెబుతూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని నారా లోకేష్ ఫైర్ అయ్యారు.
అన్నీ అబద్ధాలు...
తాను ఇక్కడే సొంతంగా ఇల్లు కట్టుకున్నా రాజధాని మారదంటూ 2019 ఎన్నికలకు వెళ్లిన జగన్, ఇప్పుడు ఆ ఎన్నికల్లో్ తీర్పు మూడు రాజధానుల కోసం ప్రజలు ఇచ్చిన తీర్పుగా మార్చివేశారని లోకేష్ ఫైర్ అయ్యారు. మురుగు బుర్రలకు మెరుగైన ఆలోచనలు ఎప్పటికీ రావని నారా లోకేష్ అన్నారు.
Next Story

