Thu Apr 02 2026 22:00:52 GMT+0530 (India Standard Time)
జగన్ కు అది అలవాటే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నవ్వుతూ అబద్ధాలు చెప్పడం జగన్ కు అలవాటుగా మారిందన్నారు. ప్రధానమంత్రి, రాష్ట్రపతులకు కూడా సులువుగా నవ్వుతూ అబద్దాలు చెప్పేయగలడన్నారు. రాజధానిపై ఈ ప్రభుత్వానికి ఎటువంటి స్పష్టత లేకపోవడం వల్లనే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయన్నారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని తమ విధానమని ఆయన తెలిపారు.
బాబు ముందు చూపు వల్లే.....
పెగాసస్ ను తాము కొనుగోలు చేసి ఉంటే జగన్ అధికారంలోకి వచ్చే వారా? అని నారా లోకేష్ ప్రశ్నించారు. వ్యవస్థలను శాశ్వతమని, వ్యక్తులు తాత్కాలికమని నమ్మే వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబు ముందు చూపుతోనే సీఆర్డీఏ చట్టం తెచ్చారని, అందువల్లే రాజధానిని న్యాయస్థానంలోనూ నిలబెట్టుకోగలిగామని నారా లోకేష్ అన్నారు. ప్రజా సమస్యలపై తమ పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు.
Next Story

