Thu Dec 18 2025 22:57:30 GMT+0000 (Coordinated Universal Time)
దసరా ఇలా సెలబ్రేట్ చేసుకుందాం : లోకేష్
జగన్ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు

జగన్ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. దేశం మొత్తం రావణాసుర దహనం చేస్తుందని, మనం చేద్దాం దజగనాసుర దహనం అంటూ ఆయన ట్వీట్ చేశారు. అరాచక, విధ్వంసక పాలన సాగిస్తున్న సైకో జగనాసురుడి పీడ పోవాలని నినదిద్దాం అంటూ లోకేష్ పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు.
జగన్ దిష్టిబొమ్మను...
ఈ నెల 23వ తేదీన విజయదశమి పర్వదినం సందర్భంగా రాత్రి 7 గంటల నుంచి 7.05 గంటల వరకూ ఐదు నిమిషాలు పాటు వీధుల్లోకి వచ్చి సైకో పోవాలి అని రాసి ఉన్న పత్రాలను దహనం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. ఆ వీడియో, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయాలని కోరారు. సైకో జగన్ అనే చెడుపై మంచి అనే చంద్రబాబు సాధించే విజయంగా ఈ దసరా పండగను సెలబ్రేట్ చేసుకుందామని నారా లోకేష్ పిలుపు నిచ్చారు.
Next Story

