Sat Mar 28 2026 20:01:35 GMT+0530 (India Standard Time)
Nara lokesh : ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు
తన తల్లిని కించపర్చిన వారిని ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.

తన తల్లిని కించపర్చిన వారిని ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఒక కేసు విసయంలో విశాఖలో కోర్టుకు హాజరైన లోకేష్ మీడియాతో మాట్లాడారు. వ్యక్తిగత జీవితంలోకి చొరబడి ఒక ప్రధాన మీడియా దుష్ప్రచారం చేయడం తగదని లోకేష్ సూచించారు. తాను ఎవరికీ భయపడబోనని, ప్రచారం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని లోకేష్ హెచ్చరించారు.
ఆ మూడు పత్రికలు.....
తన తల్లిని కించ పరుస్తూ కొందరు మాట్లాడారని, వారిని తాను వదిలిపెట్టే ప్రస్తక్తి లేదని లోకేష్ చెప్పారు. విజయలక్ష్మి, భారతి గురించి మాట్లాడితే వారు బాధపడరా? అని లోకేష్ ప్రశ్నించారు. తనను కించపర్చిన మూడు పత్రికలపై తాను దావా వేశానని చెప్పారు. ది వీక్ పత్రిక క్షమాపణలు చెప్పిందని, సాక్షి, డెక్కన్ క్రానికల్ కనీసం వివరణ కూడా ఇవ్వలేదని లోకేష్ తెలిపారు.
- Tags
- nara lokesh
- tdp
Next Story

