Thu Mar 19 2026 07:06:19 GMT+0530 (India Standard Time)
మంగళగిరి నుంచే పోటీ.. కానీ?
తాను మంగళగిరిలోనే మళ్లీ పోటీ చేస్తానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు

తాను మంగళగిరిలోనే మళ్లీ పోటీ చేస్తానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. అయితే తాను అక్కడ పోటీ చేయాలా? వద్దా? అని నిర్ణయించాల్సింది మాత్రం పార్టీ అధినేత చంద్రబాబు మాత్రమేనని అన్నారు. ఆయన చేయించుకున్న సర్వేలో మంగళగిరి ప్రజలు తనకు అండగా నిలవరని భావిస్తే తాను కూడా అక్కడ పోటీ చేయనని అన్నారు. మిగిలిన 174 నియోజకవర్గాల్లో ఎలా ఎంపిక చేస్తారో? అలాగే మంగళగిరిలో టీడీపీ అభ్యర్థి ఎంపిక ఉంటుందని లోకేష్ తెలిపారు. తాను మాత్రం మంగళగిరి నుంచే పోటీ చేయాలని భావిస్తున్నానని ఆయన తెలిపారు.
న్యూడ్ వీడియోపై....
మరోవైపు ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఫేక్ అని తేల్చడానికి ఎస్పీ ఎలా తేల్చారో చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. మార్ఫింగ్, మేకింగ్, ఒరిజినల్ అని ఎవరు చెప్పాలన్నారు. ఏ ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చిందో బయట పెట్టాలని లోకేష్ కోరారు. ఒరిజినల్ వీడియో ఉందని ఎస్పీ ఫకీరప్ప భావిస్తున్నారా? అని లోకేష్ ప్రశ్నించారు. ఎంపీ గోరంట్ల మాధవ్ ను రక్షించడానికి ఎస్పీ ముందుకు వచ్చి ఇది మార్ఫింగ్ అని చెబుతున్నారన్నారు.
Next Story

